పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం రేపు భారీ విడుదల కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం స్పెషల్ షో ను మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రాత్రి ప్రసాద్ లాబ్స్ లో తిలకిస్తారు అని తెలుస్తోంది. అయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ప్రదర్శనకు వస్తున్నట్లు సమాచారం.
పంజా చిత్రాన్ని శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి నిర్మించారు. విష్ణువర్ధన్ ఈ చిత్ర దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సరః జేన్ డయాస్ మరియు అంజలి లవానియా ఈ చిత్రం లో కథానాయికలు.