అనర్గళంగా తెలుగు మాట్లాడగలిగిన ఉత్తర భారతదేశ నటి ఎవరు ? అన్న ప్రశ్నకు సగానికి పైగా వినపడే పేరు ఛార్మి. అతి తక్కువ కాలంలో అనర్గళంగా తెలుగు మాట్లాడడం నేర్చుకున్న భామ ఛార్మి తమన్నా కూడా ఇలానే నేర్చుకున్న ఇక్కడ మనిషిలా తెలుగు మాట్లాడగలిగేది మాత్రం ఛార్మి మాత్రమే. తెలుగు మాత్రమే కాదు భారతీయ భాషలలో చాలా వరకు ఛార్మి అనర్గళంగా మాట్లాడగలదు. దీని గురించి ప్రశ్నించగా కొత్త విషయాలను నేర్చుకోవాలంటే తనకి చాలా ఇష్టమని చెప్పారు. త్వరలో మమ్ముటితో కలిసి మలయాళంలో తెరంగేట్రం చెయ్యబోతున్న ఈ భామ తన భాషా ప్రావిణ్యంతో అక్కడి ప్రేక్షకుల మనసుని కూడా కోల్లగోడుతుందేమో చూడాలి.