చాణక్యుడుగా కనిపించబోతున్న తనీష్

చాణక్యుడుగా కనిపించబోతున్న తనీష్

Published on Mar 22, 2012 11:44 PM IST

జి.శ్రీనివాస్ దర్శకత్వంలో తనీష్,ఇషిత దత్త ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “చాణక్యుడు”. ప్రేమ,వినోదం,యాక్షన్ మిళితం అయిన కథ అని, పాటలను బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నం అని దర్శకుడు తెలిపారు. చాణక్యుడుకి ఈ చిత్ర కథకు ఒక సంభంధం ఉందని అదేంటో తెలుసుకోవాలంటే చిత్రం చూడాలని కథానాయకుడు తనీష్ అన్నారు. ప్రస్తుతం పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ మొదటి వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంగి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తిరివీది సంతోష్,గొట్టిగింటి రామచంద్ర రావుమరియు నందన్ రెడ్డి కోలన్ లు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు