భారీగా అమ్ముడుపోయిన “బిజినెస్ మాన్” టికెట్ లు

భారి అంచనాల నడుమ మహేష్ బాబు నటించిన “బిజినెస్ మాన్ ” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈరోజు పొద్దున్న మొదలయిన ప్రసాద్ బూకింగ్స్ లో మొదటి రోజు ప్రదర్శించబడే 33 ప్రదర్శనల టికెట్ లు నిమిషాలలో అమ్ముడయిపోయాయి రాష్ట్రమంతట ఇదే మాట వినిపిస్తుంది ఈ ఊపు చూస్తుంటే ఈ చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డు ల ను సృష్టించేలా ఉంది. ఈ చిత్రం లో మహేహ్స్ బాబు మరియు కాజల్ లు ప్రధాన పాత్ర్హలు పోషిస్తుండగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 13 న ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version