“దమ్ము చిత్రం మీద బోయపాటి చాలా ధీమాగా ఉన్నారు” – రాజమౌళి

“దమ్ము చిత్రం మీద బోయపాటి చాలా ధీమాగా ఉన్నారు” – రాజమౌళి

Published on Apr 26, 2012 3:29 AM IST

రాజమౌళి మరియు ఎన్టీయార్ పరిశ్రమలో మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎన్టీయార్ చిత్రం విడుదల అవుతుంది అంటే రాజమౌళి అ చిత్రం గురించి మాట్లాడటం మాములు విషయమే. పలు సందర్భాలలో వీరు ఇరువురు తమ స్నేహాన్ని బహిర్గంగా వ్యక్తపరిచారు. ఈరోజు రాజమౌళి “దమ్ము” చిత్రం గురించి ఒక ఆసక్తి కరమయిన విషయాన్నీ వెల్లడించారు ” రోజు బోయపాటి గారితో మాట్లాడుతున్నాను ఆయన చాలా ధీమాగా ఉన్నారు నా భార్య ఆయన గురించి ఇలా అన్నద్ది ” ఆయన్ని చూస్తుంటే చిత్రం విడుదలవుతున్న దర్శకుడిలా లేదు విజయం సాదించిన దర్శకుడ్లా కనిపిస్తున్నారు” అన్నది నేను కూడా ఆయనలానే ధీమాగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా” అని రాజమౌళి ట్విట్టర్ లో అన్నారు. చిత్రం విడుదలయ్యే చివరి నిమిషం వరకు ఎంతో ఉత్కంఠ లోనయ్యే దర్శకుల్లో రాజమౌళి ఒకరు ప్రస్తుతం ఈయన “ఈగ” చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు నిర్విరామంగా పని చేయటం మూలాన ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్టు తెలిపారు. రాజమౌళి కూడా బోయపాటి శ్రీను లానే ప్రశాంతంగా మరియు ధీమాగా ఉండాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు