సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “ఐ”. తాజా సమాచారం ప్రకారం అమీ జాక్సన్ ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఎంపికయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ చిత్రంలో సమంత కథానాయికగా ఎంపికయ్యారు కానీ ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం మరియు తన కాల్షీట్లు కుదరకపోవడంతో ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇద్దరు కథానాయికలు ఉన్న ఈ చిత్రంలో ఒక కథానాయికగా అమీ జాక్సన్ ఎంపికయ్యారు, ఈ చిత్ర దర్శకుడు శంకర్ మరియు నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ప్రస్తుతం ఈ చిత్ర మొదటి కథానాయికను వెతికే పనిలో ఉన్నారు . విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం మరియు సురేష్ గోపిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.