అమలా పాల్ మెల్లి మెల్లిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ హీరొయిన్ గా మారబోతుంది. ప్రేమ ఖైది మరియు నాన్న వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె ఇటీవల నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రంలో కూడా మంచి నటనను కనబరిచి విమర్శకులతో పాటు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది. తాజా సమాచారం ప్రకారం వివి వినాయక డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో సెకండ్ హీరొయిన్ గా అమలా పాల్ ఎంపికైనట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ మెయిన్ హీరొయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.