చలిలో కూడా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రం లో చేస్తున్నారు ఈ చిత్రం అనుకున్న సమయానికి పూర్తి చెయ్యడానికి అల్లు అర్జున్ హైదరాబాద్ లో నమోదయిన కనిష్ట ఉష్ణోగ్రత 7 గా ఉన్నపుడు కూడా మంచులో షూటింగ్ లో పాల్గొని పెద్ద సాహసమే చేసారు విదేశాల్లో ఇలాంటి ఉష్ణోగ్రతల్లో పనిచెయ్యటం పరిపాటి అయిన హైదరాబాద్ లో ఇలాంటి ఉష్ణోగ్రత నమోదు అయినపుడు నటులు చిత్రీకరణలో పాల్గొనరు. పేరు ఇంకా ఖరారు కాని ఈ చిత్రం బాగా వస్తుంది అని అంటున్నారు ఈ చిత్రం లో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version