నట సింహం నందమూరి బాల కృష్ణ నటించిన “అధినాయకుడు” చిత్రం అన్ని అడ్డంకులను తొలగించుకొని రేపు (జూన్ 1న) విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్ర విడుదలను ఆపటానికి ఎన్నికల సంఘం నిరాకరించటంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు.ఈ చిత్రం గురించి పరిశ్రమలో సానుకూల అంశాలు వినిపిస్తున్నాయి రేపు భారీ ఓపెనింగ్స్ కి ఈ చిత్రం సిద్దమయ్యింది. సలోని మరియు లక్ష్మి రాయి లు ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. బాల కృష్ణ ఈ చిత్రంలో మూడు శక్తివంతమయిన పాత్రలలో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.