గత 49 సంవత్సరాలుగా తెలుగు సినిమాలను నిర్మిస్తున్న బ్యానర్ సురేష్ ప్రొడక్షన్. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. ఈ సురేష్ ప్రొడక్షన్ ప్రస్తుతం మరొక ప్రేమ కథ చిత్రం ‘ నేనేం చిన్న పిల్లనా’ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాకి పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోని నిన్న విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఈ సినిమా నిర్మాత డా. డి రామానాయుడు మాట్లాడుతూ ‘గతంలో మేము మా బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను, అలాగే సంగీతం పరంగా మంచి విజయాన్ని సాదించిన సినిమాలను అందించడం జరిగింది. అయితే ఈ సినిమా మ్యూజిక్ గతంలో వచ్చిన ‘ప్రేమ్ నగర్’ సినిమా అంత హిట్ సాదిస్తుంది. ఈ సినిమాలోని ఆరు పాటలు సూపర్ హిట్ అవుతాయి. అలాగే ఈ సినిమా గతంలో వచ్చిన ‘కలిసుందాం రా’ సినిమాల మంచి ప్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నాం’ అని అన్నాడు . అందాల రాక్షసి ఫేం రాహుల్ హీరోగా, తన్వి వ్యాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ లేఖ సంగీతాన్ని అందిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ముగిసింది. త్వరలో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం వుంది.