సిద్ధార్థ్ సినిమా చేయబోతున్న ఆది?

సిద్ధార్థ్ సినిమా చేయబోతున్న ఆది?

Published on Mar 18, 2012 2:09 PM IST

తను నటించిన మొదటి చిత్రం ‘ప్రేమకావాలి’ తోనే విజయాన్ని అందుకున్న హీరో ఆది. విలక్షణ నటుడు సాయి కుమార్ తనయుడు అయిన ఆది రెండవ సినిమా లవ్లీ విడుదల కాకముందే మరో సినిమా అంగీకరించాడు. నానితో ‘పిల్ల జమిందార్’ అనే సినిమా తీసిన దర్శకుడు అశోక్ డైరెక్షన్లో అది నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొదటగా ఈ సినిమా సిద్ధార్థ్ చేయడానికి సిద్ధార్థ్ అంగీకరించగా పలు కారణాల వాళ్ళ సిద్ధార్థ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ అవకాశం ఆదికి దక్కింది. పలు డబ్బింగ్ సినిమాల్ని పంపిణీ చేసిన కెవివి సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఆది నటించిన రెండవ సినిమా లవ్లీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. లవ్లీ సినిమాలో ఆదికి జోడీగా శాన్వి నటించగా బి. జయ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు