మార్చ్ 20న “3” ఆడియో విడుదల

మార్చ్ 20న “3” ఆడియో విడుదల

Published on Mar 19, 2012 11:10 PM IST

ధనుష్ మరియు శ్రుతి హసన్ లు ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “3” చిత్ర ఆడియో విడుదల మార్చ్ 20న హైదరాబాద్ లో జరగనుంది తమిళ చిత్రం “3”కి రీమేక్ అయిన ఈ చిత్రం తెలుగులోకి అదే పేరుతో అనువాదం కానుంది. ఐశ్వర్య దనూష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో నట్టికుమార్ సమర్పిస్తున్నారు. ఈ మధ్యనే భారీ ధరకు ఈయన అనువాద హక్కులను కొనుక్కున్నారు. ధనూష్,ఐశ్వర్య ధనూష్,శ్రుతి హాసన్ మరియు అనిరుధ్ మరికొంతమంది అతిధులతో ఈ వేడుకకు కళను తీసుకురానున్నారు. దేశం మొత్తం ఒక ఊపు ఊపిన “వై దిస్ కొలవేరి డి?” పాట ఈ చిత్రంలోనిదె తెలుగులో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి. తమిళ చిత్రానికి “యు” సర్టిఫికేట్ ఇచ్చారు. రాబోయే వారం లో తెలుగు చిత్రానికి కూడా సెన్సార్ చెయ్యబోతున్నారు. తమిళ మరియు తెలుగు రెండు చిత్రాలు మార్చ్ 30న విడుదల కానున్నాయి.

తాజా వార్తలు