ద్విభాషా చిత్రంగా రాబోతున్న విజయ్ ‘తుపాకీ’?

ద్విభాషా చిత్రంగా రాబోతున్న విజయ్ ‘తుపాకీ’?

Published on Feb 27, 2012 3:00 PM IST

విజయ్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న తరువాతి చిత్రం ‘తుపాకీ’ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే వినిపిస్తోంది. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలు పోలీసు పాత్రలు పోషించగా విజయ్ పొక్కిరి చిత్రంలో పతాక సన్నివేశాల్లో పోలీసు గా కనిపించదు. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించనున్నాడు. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు