కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో విశ్వరూపం చూపించనున్న కమల్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో విశ్వరూపం చూపించనున్న కమల్

Published on Mar 1, 2012 1:00 AM IST

కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం’ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ చిత్రంలో ప్రదర్శించనున్నారా? ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లో జరిగే ఈ ఫెస్టివల్ కి వివిధ దేశాల నుండి పలు దేశాల నుండి చిత్రాలు ప్రదర్శనకి వస్తాయి. కేన్స్ నిర్వాహకులు విశ్వరూపం పై చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సమయంలోపు ఈ చిత్రం పూర్తి చేసి ప్రదర్శనకు ఉంచాలని నిర్వాహకులు కోరినట్లు తెలిసింది. కమల్ హాసన్ ఈ చిత్రంలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. పివిపి సినిమా బ్యానర్ పై పోట్లురి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు