బ్యాంకాక్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న మిర్చి

mirchi
ప్రభాస్ రాబోతున్న చిత్రం “మిర్చి” చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతుంది. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ కృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ మరియు రిచా మీద ఈ షెడ్యూల్ లో సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం వరకు పొల్లాచ్చి, తెన్ కాశి మరియు హైదరాబాద్లలో చిత్రీకరించారు. ఇటలీలో రెండు పాటలను విభిన్నంగా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. పోస్టర్స్లో ప్రభాస్ లుక్ చూపరులను ఆకట్టుకుంది చిత్రం మీద మరింత అంచనాలను పెంచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిన్స్తున్నారు.ఈ చిత్ర ఆడియో విడుదల ఈ నెలలోనే జరగనుంది చిత్రాన్ని 2013లో విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version