మనోజ్ – తేజ ‘మిరాయ్’ పై లేటెస్ట్ అప్ డేట్

మనోజ్ – తేజ ‘మిరాయ్’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on May 20, 2025 3:04 PM IST

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న “మిరాయ్” సినిమాలో తేజ సజ్జతో పాటు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని చారిత్రాత్మక గుహలలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో తేజ సజ్జా తో పాటు, కొంతమంది ప్రధాన పాత్రలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషల్లో 2D మరియు 3D ఫార్మాట్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

కాగా ఈ సినిమా మొత్తం మనోజ్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని.. పైగా మనోజ్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని.. అందుకే ఈ పాత్రను కార్తీక్ ఘట్టమనేని చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్. ఆ మధ్య మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ లో సాలిడ్ యాక్షన్ లుక్ లో.. కత్తి పట్టుకొని “ది బ్లాక్ స్వార్డ్” గా మనోజ్ హైలైట్ అయ్యాడు. అన్నట్టు ఈ చిత్రానికి గౌర హరీష్ నే సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు