యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా ఓ సూపర్ యోధ పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. హనుమాన్ చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ హీరోగా మారిన తేజ సజ్జా, ఇప్పుడు మిరాయ్ చిత్రానికి పెట్టుకున్న టార్గెట్ రూ.24.5 కోట్లు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలుపుకుని ఈ బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై నెలకొన్న బజ్ దృష్ట్యా ఇది చాలా ఈజీ టాస్క్ అని.. ఈ చిత్ర బయ్యర్లకు ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు యూఎస్‌లో రూ.4.5 కోట్లు, ఆంధ్ర – రూ.8 కోట్లు, నైజాం – రూ.7 కోట్లు, సీడెడ్ – రూ.3 కోట్లు, కర్ణాటక – రూ.2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.