స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలో శీలవతి పాత్రలో అనుష్క స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 37 నిమిషాలకు లాక్ చేశారు మేకర్స్.
ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ నాగవెల్లి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్‌కు రెడీ అయింది.