తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!

తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!

Published on Sep 16, 2025 5:07 PM IST

jr-ntr-Karthik-Gattamneni

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు భారీ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు వార్ 2 తో మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ లైనప్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే ఈ లైనప్ లో ఒకవేళ అవకాశం వస్తే సరైన సినిమా తీస్తానని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెబుతున్నాడు.

తారక్ అన్నతో సినిమా చేసే అవకాశం వస్తే తనని పెట్టి ఒక సూపర్ హీరో సినిమా చేస్తానని తెలిపాడు. అంతే కాకుండా ఆ సినిమాలో కూడా ఖచ్చితంగా ఇతిహాస ఎలిమెంట్స్ ఉంటాయని కూడా తెలిపాడు. మరి తన సైడ్ నుంచి ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ విషయంలో మంచి క్లారిటీ గానే తాను ఉన్నాడని చెప్పవచ్చు. మరి ఫ్యూచర్ లో ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు