సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. దీనిలో ఇప్పటివరకు తెలుగు సినిమాలలో ఎవరు తీయని విధంగా అద్భుతమైన చేజింగ్ సన్నివేశాలను ఈ సినిమాలో చిత్రీకరిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమె మొదటి సినిమా. ఈ సినిమా గత కొద్ది రోజులకు ముందు బెల్ఫాస్ట్, లండన్ లలో షూటింగ్ జరుపుకుంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. అయితే వీటిలో లండన్ లోని లంబెత్ బ్రిడ్జ్ పై ఒక రిస్కీ స్టంట్ చిత్రీకరించారు. స్టీఫెన్ కరెన్, ఒక విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ లు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమా యూనిట్ ఒక కారు క్రాష్ అయ్యే సన్నివేశాలను ఈ బ్రిడ్జ్ పై చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా 18 చక్రాల లారి ఒక్కసారిగా అక్కడకు వచ్చిందని తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా రెండవ టీజర్ విడుదలైంది. దీనిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించడం జరిగింది. ఇది థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతోందని సమాచారం. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కావడానికి సిద్దమవుతోంది.