ఒక కొత్త దర్శకుడు టాలీవుడ్ కి ఒక హిట్ ఇచ్చాడంటే, వెంటనే చాలా విలువ సంపాదించుకుంటాడు. ఇది చాలా సార్లు రుజువైంది, మళ్ళి ఈ విషయం మేర్లపాక గాంధీ విషయం లో నిరూపితమవుతుంది. తన మొదటి చిత్రమైన ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్’ తో హిట్ కొట్టిన గాంధీ ని చాలా మంది నిర్మాతలు కలుస్తున్నారు.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం దానయ్య మరియు బండ్ల గణేష్ ఈ యువ దర్శకునితో పని చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు . గాంధీ కెరీర్ ఎలా మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.