బిగ్ బాస్ 4 – ఈ ఇద్దరికీ ఓట్ చెయ్యమంటున్న మెహబూబ్.!

ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మరింత రసవత్తరంగా సాగుతుంది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ఓ రేంజ్ లో అయ్యింది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక్క అవినాష్ తప్పితే మిగతా అంతా రెండు టీమ్స్ గా అయ్యినట్టు కనిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా లాస్ట్ ఎలిమినేషన్ ఎంత ఎమోషనల్ గా జరిగిందో చూసాము. మెహబూబ్ ఎలిమినేషన్ తో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అంతా విపరీతమైన ఎమోషనల్ అయ్యిపోయారు. ఇప్పుడు ఇదే మెహబూబ్ తన తోటి ఇంటి సభ్యులు అయినటువంటి వారిలో ఓ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కు ఓట్ చెయ్యమని తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపాడు.

వాళ్ళు మరెవరో కాదు అభిజీత్ మరియు షోయెల్ లే. మెహబూబ్ మరియు షోయెల్ ల నడుమ ముందు నుంచి మంచి బాండింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అలాగే అభిజీత్ తో అయితే మరింత ఎమోషనల్ బాండింగ్ ఉంది. అందుకే అభి ఫోటోనే పెట్టి ఓట్ చెయ్యమని చెప్పాడు. అలాగే షోయెల్ కు కూడా ఓట్ చెయ్యాలని మెన్షన్ చేసాడు.

Exit mobile version