‘ఆచార్య’ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘ఆచార్య’ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 11, 2020 7:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ప్రస్తుతం చిరు కరోనాతో హోమ్ క్వారెంటెన్ లో ఉండటంతో ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో కొరటాల లేరని తెలుస్తోంది. మరో రెండు నెలలు వరకూ ఆగుదాం అనే ఆలోచనలో మెగాస్టార్ కూడా ఉన్నారట. అయితే కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి, కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట కొరటాల.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ ను కూడా మార్చారు. అన్నట్టు ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందట. ఏది ఏమైనా మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది.

తాజా వార్తలు