కరోనా భద్రతా చర్యల పై మెగాస్టార్ వీడియో !

కరోనా భద్రతా చర్యల పై మెగాస్టార్ వీడియో !

Published on Mar 19, 2020 2:35 PM IST

కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కరోనా పై జాగ్రత్త వహించాలనే విషయాన్ని ఆయన ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కాగా జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని మరియు సురక్షితంగా ఉండాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఇక కరోనా కారణంగానే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు