‘దసరా’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమా కంటే కూడా మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమాపై బజ్ ఎక్కువ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెలను నాని తీసుకెళ్లాడట. అయితే, మెగాస్టార్ ఈ సినిమా కథ నచ్చిన తర్వాత శ్రీకాంత్ ఓదెలకు ఓ కండీషన్ పెట్టాడట.
శ్రీకాంత్ చెప్పిన కథను నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని చిరు చెప్పడం విశేషం. ఇక ఈ ప్రాజెక్టును కడా త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది.