టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఆగస్టు 22న అభిమానులు ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ రోజు మెగాస్టార్ నుంచి తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక చిరు నుంచి ఈసారి బర్త్ డే కానుకగా ‘విశ్వంభర’ వస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ, ఈ బర్త్ డే కి మెగా ట్రీట్ ‘విశ్వంభర’ నుంచి ఉండబోదని సినీ సర్కిల్స్ టాక్. విశ్వంభర వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉండటంతో ఈ మూవీ రిలీజ్ సాధ్యం కాదని.. అయితే, మెగా ఫ్యాన్స్ కోసం చిరు నటించిన ‘స్టాలిన్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.
ఇలా బర్త్ డే రోజున మెగాస్టార్ నుంచి కొత్త సినిమా వస్తుందేమో అని ఆశిస్తున్న అభిమానులకు ఇప్పుడు స్టాలిన్ సినిమాతో వారి ఆశలపై నీళ్లు చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.