చిరుకి ఏం కాకూడదని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు!

చిరుకి ఏం కాకూడదని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు!

Published on Nov 10, 2020 12:00 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా పాజిటివ్ రిపోర్ట్ అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా విస్మయానికి గురి చేసింది. దీనితో తెలుగు ఇండస్ట్రీ అంతా చిరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని చిరు చెప్పారు. అయినప్పటికీ ఐసోలేషన్ తీసుకొన్నాని అంతే కాకుండా దాహం ఆరోగ్యం కోసం తానే స్వయంగా అందరికీ తెలియజేస్తానని కూడా తెలిపారు.

కానీ చిరు నుంచి ఇలాంటి వార్త రావడంతో అభిమానులు తీవ్రంగా కలత చెందారు. దీనితో చిరుకు ఏమీ కాకూడదని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చిరు కొలిచే ఆరాధ్య దైవం హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ, గుంటూరు అలాగే గోదావరి జిల్లాల్లో అభిమానులు ఇప్పటికే పూజలు చేయిస్తున్నారట. మరి చిరుకి ఏమి కాకుండా తిరిగి కోలుకొని యథేచ్ఛగా షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుందాం.

తాజా వార్తలు