ఓటిటిలో సెన్సేషన్ సెట్ చేసిన ‘మయసభ’.. ఇండియా లోనే మొదటి తెలుగు షోగా

mayasabha

ఇటీవల ఓటిటిలో రిలీజ్ కి వచ్చి మంచి రెస్పాన్స్ ని అందుకున్న అనేక వెబ్ సిరీస్ లు కనిపిస్తాయి. మరి ఇలా వచ్చిన సిరీస్ లలో మన తెలుగు నుంచి వచ్చిన సిరీస్ లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఓ సిరీస్ మాత్రం ఇండియన్ ఓటిటిలో సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఇద్దరు రాజకీయ శక్తులు అంతకు మించిన ప్రాణ స్నేహితుల కల్పిత కథగా దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన తన మార్క్ వెబ్ సిరీస్ నే “మయసభ”. చైతన్య రావు అలాగే ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ఈ ఆగష్టు 7న సోనీ లివ్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

మరి అందులో సూపర్ హిట్ అయ్యిన ఈ సిరీస్ ఇండియా లోనే టాప్ 5 షోస్ లో ఒకటిగా నిలిచినట్టు సోని లివ్ వారు అనౌన్స్ చేశారు. అంతే కాకుండా ఈ ఫీట్ ని అందుకున్న మొదటి తెలుగు సిరీస్ గా మయసభ నిలిచినట్టు తెలిపారు. మొత్తానికి మాత్రం ఓటిటిలో ఈ సిరీస్ దుమ్ము లేపుతుంది అని చెప్పాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version