వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం

baadshah

ఎన్టీఆర్ ‘బాద్షా’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుని పాటల షూటింగ్ పనిలో పడింది. హీరో హీరోయిన్ మీద సాగే సైరో సైరో అనే సాంగ్ మరియు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసారు. మిగిలి ఉన్న నాలుగు పాటల్లో ఐటెం సాంగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఏ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్లో ఖర్చుకి వెనకాడకుండా భారీ సెట్ వేసినట్లు నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా షూటింగ్ ప్రాంతానికి వెళ్ళిన కోన వెంకట్ సెట్ అధ్బుతంగా ఉందని తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version