మాస్ మహారాజ్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

మాస్ మహారాజ్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

Published on Jan 1, 2021 10:00 AM IST

మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పవర్ ఫుల్ కాప్ డ్రామా “క్రాక్” ఈ సంక్రాంతికి విడుదల కానుంది. మరి ఈ చిత్రం లైన్ లో ఉండగానే రవితేజ స్టార్ట్ చేసేసిన మరో చిత్రం “ఖిలాడి”. హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రం నుంచి కొత్త సంవత్సరం కానుకగా లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. డ్యూయల్ రోల్ లో రవితేజ ఇంట్రెస్టింగ్ గా కనిపించగా రవితేజ ఫ్యాన్స్ కు మరో సూపర్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలోనే విడుదలకు తీసుకొచ్చేస్తున్నట్టుగా డబుల్ కిక్ ఇచ్చారు.

దీనితో రవితేజ ఈ సినిమాను ఎంత వేగంగా ఫినిష్ చెయ్యనున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చ్చిత్రంలో డింపుల్ హయాతి మరియు మీనా చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ వారు అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు