విడుదలకు ముందు మంచి బిజినెస్ చేస్తున్న’ మసాలా’

masala-news
విక్టరి వెంకటేష్ – రామ్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘మసాలా’ పై విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తుండడంతో ఈ సినిమా నిర్వాహకులు చాలా సంతోషంగా వున్నారు. ‘బోల్ బచ్చన్’ సినిమాకి వచ్చిన మంచి రికార్డ్ లతో ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 14 న విడుదలకానుంది. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో అంజలి, షాజహాన్ పదమ్సీలు హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్ ను ఇచ్చింది. స్రవంతి రవి కిషోర్, డి. సురేష్ బాబు కలిసి ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version