హీరో రామ్ ‘మసాలా’ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నాడు. తను విక్టరి వెంకటేష్ తో కలిసి నటించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో తను చేసిన పాత్రని చూస్తే నవ్వు వచ్చే విదంగా ఉంటుందని రామ్ తెలియజేశాడు. ” ఈ సినిమా మొత్తం చాలా కామెడీగా ఉంటుంది. చూస్తున్నంతసేపు నవ్వుతూనే వుంటారు. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సాదిస్తుంది” అని అన్నాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “బోల్ బచ్చన్” సినిమాకి రీమేక్ గా ‘మసాలా’నిర్మించడం జరిగింది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి, షాజాహాన్ పదమ్సీలు హీరోయిన్స్ గా నటించారు. స్రవంతి రవి కిషోర్ – డీ. సురేష్ బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు.