వెంకీ – రామ్ ల ‘మసాలా’కి క్లీన్ ‘యు’

Masala-New-Posters
విక్టరీ వెంకటేష్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘మసాలా’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బోల్ బచ్చన్’ కి ‘మసాలా’ రీమేక్.

ఈ సినిమాలో వెంకటేష్ వచ్చీ రాని ఇంగ్లీష్ తో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్దమవుతుంటే, రామ్ రెండు విభిన్న గెటప్స్ లో కనిపించి నవ్వించనున్నాడు. ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా అంజలి, రామ్ కి జోడీగా షాజన్ పదమ్సీ కనిపించనున్నారు. విజయ భాస్కర్ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు. డి. సురేష్ బాబు – స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఈ చిత్ర టీం ఎంతో నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version