వెంకీ – రామ్ లు కలిసి మసాలా చూపిస్తారా??

venky-ram
విక్టరీ వెంకటేష్- ఎనేర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీలో విజయవంతమైన ‘బోల్ బచ్చన్’ కు రీమేక్. ప్రస్తుతం నిర్మాణ దశలోవున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఏమిటంటే ఈ చిత్రానికి ‘మసాలా’ అనే పేరును అనుకుంటున్నారు. ఈ వార్తను చిత్ర బృందం ఇంకా ఖరారు చెయ్యవలసివుంది. ఇప్పటికే ఈ సినిమాకు చాలా పేర్లను పరిశీలించారు. ‘గరమ్ మసాల’, ‘గోల్ మాల్’ వంటి పేర్లు వినబడ్డాయి. ఇప్పుడు ‘మసాలా’ సైతం ఖరారు అవుతుందో లేదో చూద్దాం

ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు లోగో త్వరలో విడుదలయ్యి ఈ ఊహలకు తెరదించనున్నాయి. ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకుడు. సురేష్ బాబు తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. అంజలి మరియు షాజన్ పదాంసి హీరోయిన్స్

Exit mobile version