వాయిదాపడిన మసాలా ఆడియో

venkatesh-and-ram-for-golma

విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి నటిస్తున్న ‘మసాలా’ సినిమా ఆడియో ఈనెల 23న విడుదలకు సన్నద్ధమయింది. కానీ ఇప్పుడు ఈ వేడుక వాయిదాపడింది. కొత్త తేదిని ఇంకా ప్రకటించలేదు

హీరో రామ్ తన ట్విట్టర్ అకౌంట్ లో “అనుకోకుండా చిన్న మార్పు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో విడుదల వాయిదా వెయ్యవలసి వచ్చింది.. ప్రేక్షకులకు క్షమాపణ.. విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తాం” అని తెలిపాడు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. అంజలి మరియు షాజాన్ పదాంసి హీరోయిన్స్

విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. స్రవంతి రవి కిషోర్ మరియు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతలు. ‘మసాలా’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘బోల్ బచ్చన్’ కు రీమేక్

Exit mobile version