అల్లు శిరీష్, రెజినా జంటగా మారుతీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కొత్తజంట’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన కొన్ని సన్నివేశాలను మాటీవీ ఆఫీసులో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు శిరీష్ ఒక టీవీ చానల్ ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా శిరీష్ కి మంచి బ్రేక్ ను ఇస్తుందని బావిస్తున్నారు. తను నటించిన మొదటి సినిమా ‘గౌరవం’ బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత విజయాన్ని సాదించలేకపోయింది. ఈ సినిమా సంబందించిన మరింత సమాచారని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ వుంటాం.