‘బస్ స్టాప్’ వచ్చేస్తోంది.

‘బస్ స్టాప్’ వచ్చేస్తోంది.

Published on Nov 10, 2012 9:58 AM IST


మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ తోనే సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘బస్ స్టాప్’. ఈ సినిమా నవంబర్ 11న భారీగా విడుదలవ్వడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి మొదట సెన్సార్ వారు 45 కట్స్ విధించారు మళ్ళీ ట్రిబ్యునల్ కి పంపగా, వారు ఆ గండం నుంచి గట్టేక్కించి కేవలం 5 కట్స్ తోనే సినిమా విడుదలకి అంగీకారం తెలిపారు. మొదట ఈ చిత్రాన్ని నవంబర్ 23న విడుదల చేయాలని అనుకున్నారు కానీ అక్కినేని నాగార్జున – అనుష్క జంటగా నటించిన ‘డమరుకం’ సినిమా నవంబర్ 10న విడుదల కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గత రెండు వారాలుగా సినిమాలు రాకపోవడంతో ఆ గ్యాప్ ని కవర్ చేద్దామని ముందుగానే విడుదల చేస్తున్నారు.

బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి జె.బి సంగీతం అందించగా, ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో ప్రిన్స్ – శ్రీ దివ్య జంటగా నటించారు. ఈ సంవత్సరంలోనే ‘ఈ రోజుల్లో’ తో తోలి హిట్ అందుకున్న మారుతి ‘బస్ స్టాప్’ తో మరో హిట్ అందుకుంటారో? లేదో? చూడాలి మరి.

తాజా వార్తలు