మంచు మనోజ్ త్వరలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం చెయ్యనున్నారు. నాగేశ్వర్ రెడ్డి “దేనికయినా రెడి” చిత్రంతో విష్ణుకి హిట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు ఈ చిత్రం 2013 మొదట్లో చిత్రీకరణ మొదలుపెట్టుకుంటుంది. కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్క నున్న ఈ చిత్రం కోసం కొత్త కథానాయికను ఎంపిక చెసుకొనున్నారు. మనోజ్ కామెడి టైమింగ్ అందరికి తెలిసిందే కామెడి చిత్రాలను తెరకెక్కించడంలో నాగేశ్వర్ రావు శైలి కూడా తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే ఆసక్తికరమయిన విషయం ఈ చిత్రం గురించి మరియు చిత్ర బృందం గురించిన మరిన్ని విశేషాలను త్వరలో ప్రకటిస్తారు.