‘మిస్టర్ నూకయ్య’గా మారిన మనోజ్

‘మిస్టర్ నూకయ్య’గా మారిన మనోజ్

Published on Feb 23, 2012 1:53 PM IST


అవును మీరు విన్నది నిజమే. మంచు మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రాన్ని మిస్టర్ నూకయ్య గా మార్చారు. ప్రముఖ మొబైల్ కంపెనీ నుండి కాపీ రైట్ సమస్యలు రావడంతో ఈ చిత్ర టైటిల్ ను మిస్టర్ నూకయ్య గా మార్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకున్నాయి. మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కన్నెగంటి అని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డిఎస్ రావు నిర్మాత. మనోజ్ సరసన కృతి ఖర్భంద మరియు సన ఖాన్ నటిస్తున్నారు.

తాజా వార్తలు