పోటుగాడు మళ్లీ మొదలెట్టాడు

potugadu-movie-stills
మంచు మనోజ్ తదుపరి సినిమా ‘పోటుగాడు’ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో వుంది. ఇంకో మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. కాస్త విరామం తరువాత ఈరోజు తిరిగి షూటింగ్లో పాల్గున్న తారాగంతమంతా కలిసి జూన్ నెలాఖరుకల్లా చిత్రీకరణను ముగిస్తారట. ఏప్రిల్ లో మొదలైన ఈ సినిమా చాలా భాగం చాలా వేగంగా ముగించుకుంది. బీజాపూర్, బెంగుళూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేసారు. సాక్షి చౌదరి, నటాలియా కౌర్, సిమ్రాన్ ముండి మరో నటీమణి మనోజ్ సరసన కనిపించనున్నారు. పవన్ వాడేయార్ దర్శకుడు. మనోజ్ యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. శిరీష, శ్రీధర్ రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చక్రి మరియు అచ్చు సంగీతం అందించారు.

Exit mobile version