వారి సత్తా ఎంత అనేది అప్పుడే తెలుస్తుంది.!

తన పాటలకంటే ఎక్కువగా తను అందించిన నేపధ్య సంగీతానికే ఎక్కువ పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడు స్వరబ్రహ్మ మణిశర్మ. ఇప్పటికే 150 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించిన మణిశర్మ తాజా సంగీతం అందించిన చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకి ఇచ్చ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఉన్న సంగీత దర్శకులను చూసి ఏమనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఎం.ఎం కీరవాణి గారి తర్వాత అంత బాగా స్వరాలు కంపోస్ చేసే వాళ్ళెవరూ దరిదాపుల్లో కనిపించడం లేదు. అందరూ సగం తెలిసి సగం తెలియని వారే, ఎదో రెండు మూడు పాటలు బాగా కొట్టేసి ఆల్బం హిట్ అనుకుంటున్నారు కానీ నేపధ్య సంగీతం ఇచ్చేటప్పుడే వారిలోనే సత్తా ఎంత అనేది బయటపడుతుందని’ ఆయన అన్నారు. రానా మరియు నయనతార జంటగా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు.

Exit mobile version