సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న మనీషా కొయిరాల

Manisha-Koirala
1990లలో సూపర్ స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మనీషా కొయిరాల గత కొద్ది రోజుల క్రితం కాన్సర్ కి గురైంది. ఆమె చాలా రోజులు యుఎస్ లో ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆమె ట్రీట్ మెంట్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చి త్వరగానే కోలుకుంది. మనీషా ప్రస్తుతం సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతోంది అందుకే ఆమె ప్రస్తుతం కథలు వింటోంది. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ నేను సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నాను. అలాగే సౌత్ ఇండియన్ సినిమాలు చేయడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని’ తెలిపింది. మనిషా కొయిరాల చివరిగా రామ్ గోపాల్ వర్మ తీసిన భూత్ రిటర్న్స్ సినిమాలో కనిపించింది.

Exit mobile version