విక్రమ్-మణిరత్నం మూవీ సెకండ్ షెడ్యూల్

విక్రమ్-మణిరత్నం మూవీ సెకండ్ షెడ్యూల్

Published on Feb 4, 2020 8:28 AM IST

దిగ్దర్శకులలో ఒకరైన మణిరత్నం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చోళ రాజుల పీరియాడిక్ స్టోరీగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ నటిస్తుండగా జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో పూర్తి చేశారు.

కాగా నేటి నుండి పొన్నియిన్ సెల్వన్ సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ దర్శకుడు మణిరత్నం పాండిచ్చేరి లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అక్కడికి చేరుకోగా నేటి నుండి వారం రోజులకు పైగా అక్కడ షూటింగ్ జరగనుంది. పొన్నియిన్ సెల్వన్ నవలను సినిమాగా ఎమ్ జి రామచంద్రన్ తీయాలి అనుకున్నారు. 1958లోనే ఆయన జెమినీ గణేష్,సావిత్రిలతో ఈ సినిమా తెరకెక్కించాలని భావించారు. ఐతే అదే సమయంలో ఆయనకు ఓ ప్రమాదం జరగడంతో ఆయన ఈ ఆలోచన విరమించుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

తాజా వార్తలు