ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన గ్రేట్ డైరెక్టర్ !

మణిరత్నం… సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నేటి క్లాసిక్ చిత్రాల ఫేవరేట్ డైరెక్టర్. ప్యూర్ లవ్ డ్రామాలో రియలిస్టిక్ ఎమోషన్స్ తో పాటు ఇంటర్నల్ మెసేజ్ ఇస్తూ ఆకట్టుకోవడంలో మణిరత్నంను మించిన డైరెక్టర్ లేడు. అందుకే ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం మణిరత్నంను ఆరాధిస్తుంటారు. ఆయన తీసిన ‘నాయకుడు’, ‘దళపతి’, ‘సఖి’, ‘రోజా’, ‘గీతాంజలి’ వంటి అద్భుతమైన చిత్రాలను ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటారు.

కాగా తాజాగా మణిరత్నం ఆయన సతీమణి సుహాసినితో పాటు హీరో మాధవన్, కుష్బూ ఇంకా ఇతర సెలబ్రిటీలతో కలిసి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్నారు. ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకుని అభిమానులతో పాటు ప్రముఖులను కూడా ఆశ్చర్యపరిచారు. అలాగే కొంతమంది నెటిజనులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి సుహాసిని హీరో మాధవన్ తో మాట్లాడుతూ… ‘ మాధవన్… నువ్వు మణిరత్నం గారికి గోల్ఫ్ ఆట నువ్వు నేర్పించిన తర్వాత అతని జీవితమే మారిపోయింది’ అని సరదాగా అన్నారు.

అలాగే పూనమ్ థిల్లాన్ అడిగిన ప్రశ్నకు మణిరత్నం సమాధానమిస్తూ.. ‘మీరు మంచి నటన వచ్చిన వారినే తీసుకుంటారా? లేదా సాధారణమైన నటులను తీసుకుని మీ సినిమాల ద్వారా ఉత్తమునటులుగా తీర్చిదిద్దుతారా ? అని ప్రశ్నిస్తే.. దానికి మణిరత్నం నవ్వుతూ.. నేను తీసుకునే నటీనటులతో దయచేసి బాగా నటించండని చెబుతుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఓటీటీ వంటి ప్లాట్‌ఫాంల కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను ఫుట్‌బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Exit mobile version