‘కన్నప్ప’కి షాకింగ్ బడ్జెట్.. ప్రభాస్ సినిమా కంటే తక్కువ పవన్ సినిమా కంటే ఎక్కువ


మంచు వారి హీరో మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కన్నప్ప”. తన డ్రీం ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో అది కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న ఈ సినిమాలో అనేకమంది స్టార్ నటులు నటించారు. మరి ఇలా అత్యున్నత ప్రమాణ విలువలతో దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా విష్ణు తీసుకున్నాడు. అయితే తనన కెరీర్లోనే భారీ బడ్జెట్ ని కూడా పెట్టారు.

అయితే సినిమా స్టార్ట్ చేసిన సమయంలో 100 కోట్లు బడ్జెట్ అని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా మంచు విష్ణు కామెంట్స్ వైరల్ గా మారాయి. తమ చిత్రానికి ప్రభాస్ ది రాజా సాబ్ కంటే కొంచెం తక్కువ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అయ్యింది అంటూ తన మార్క్ సమాధానం అందించాడు. ఈ రెండు సినిమాలకి బడ్జెట్ సుమారు 300 నుంచి 400 కోట్ల రేంజ్ లో అని టాక్ ఉంది అంటే మినిమమ్ 200 కోట్లు అయినా కన్నప్పకి పెట్టుండాలి మరి.

Exit mobile version