గత కొంతకాలం నుంచి మన తెలుగు టాప్ హీరోల సినిమాలు వరుసగా యూరప్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. తాజాగా ఆ లిస్టులో మంచు విష్ణు కూడా చేరనున్నారు. విష్ణు హీరోగా, బొద్దు గుమ్మ హన్సిక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘దేనికైనా రెడీ’. ఇటీవలే ఈ చిత్ర టీం ప్రేమ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో బాంకాక్లో ఒక పాటను చిత్రీకరించుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. త్వరలోనే మరో పాట చిత్రీకరణ కోసం మంచు విష్ణు మరియు అతని టీం యూరప్ వెళ్లనున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు విష్ణు వాయిస్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథా రచయితలు కోన వెంకట్ – గోపి మోహన్ కథ అందించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
యూరప్ వెళ్తున్న మంచు విష్ణు
యూరప్ వెళ్తున్న మంచు విష్ణు
Published on Sep 6, 2012 9:25 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!