ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి ఊహించని విధంగా మంచి టాక్ ని సొంతం చేసుకున్న భారీ చిత్రమే “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మేకర్స్ పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగానే డే 1 నుంచే ఊహించని రెస్పాన్స్ ని అలాగే బుకింగ్స్ ని కూడా సొంతం చేసుకున్న కన్నప్ప కొన్ని విషయాల్లో మాత్రం పలు విమర్శలకి ప్రశ్నలకి చెక్ పెట్టింది.
ముఖ్యంగా హీరో మంచు విష్ణు అయితే తనని ట్రోల్ చేసేవారికి తన నటనతోనే సమాధానం ఇచ్చాడని చెప్పవచ్చు. కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ లో తన సింగిల్ టేక్ డైలాగ్ కానీ శివునికి తన నేత్రాలని అర్పించే మొత్తం ఎమోషనల్ ఎపిసోడ్ తో గాని ట్రోలర్స్ కి సైతం నోటి నుంచి మాట రాకుండా చేయడం అనేది విష్ణుకే చెల్లింది. తన కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇలా కన్నప్పతో మాత్రం మంచు విష్ణు కూడా మంచి మార్కులు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ అందుకోవడం విశేషం.