మంచువారి మల్టీ స్టారర్ సినిమా పేరు ‘పాండవులు పాండవులు తుమ్మెదా’??

Manchu-multi-starrer
మొత్తానికి మంచు ఫ్యామిలీ నటులైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు మరియు మనోజ్ లు తాము నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో బిజీగా వున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాలో హన్సిక, ప్రణీత మరియు రవీనా టాండన్ హీరోయిన్స్. తనీష్ మరియు వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే ఫ్యామిలీ డ్రామాగా సాగుతుందని సమాచారం.

లక్ష్యం సినిమాను తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మల్టీ స్టారర్ పై మరిన్ని వివరాలు త్వరలోనే మీకందిస్తాం ఫ్రెండ్స్.

Exit mobile version