మంచు మనోజ్ మరోసారి తన ‘పోటుగాడు’ సినిమాకోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. పవన్ వాడేయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొన్ని రోజులుగా కర్ణాటకలో జరుగుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను మనోజ్ మరియు మిగిలిన తారల మధ్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు స్టీఫెన్ అనే హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ ను అనుకున్నారు. ఇప్పుడు మనోజ్ అతను బృందంలో లేడని ఖరారు చేసాడు. “‘పోటుగాడు’ సినిమాకు స్టంట్ మాస్టర్ గా నేను, రాంబాబు వ్యవహరిస్తున్నాం. ఇంగ్లీష్ మాస్టర్ స్టీఫెన్ పని చేయడం లేదు.. ఇది మీ క్లారిటి కోసమే… “అని ట్వీట్ చేసాడు. ఈ సినిమా రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష మరియు శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిమ్రాన్ ముండి కౌర్, సాక్షి చౌదరి, నటాలియ కౌర్ మరియు మరొక తార ఈ సినిమాలో మనోజ్ సరసన నటిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.