అన్నయ్య దర్శకుడితో మొదలుకానున్న తమ్ముడి సినిమా

MANOJ_NAGESWAR_RAMESH-PUPPA

మంచు మనోజ్, జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలోఒక కామెడీ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాని ఎల్లో ఫ్లవర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ పుప్పల నిర్మిస్తున్నాడు. నాగేశ్వర రెడ్డి గతంలో మనోజ్ అన్నయ్య విష్ణు మంచుతో కలిసి హిట్ సినిమా ‘దేనికైనా రెడీ’ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 9 నుండి మొదలవుతుంది. గోపి మోహన్, కోన వెంకట్, బివిస్ రవి లు స్క్రీన్ ప్లే ని అందిస్తున్న ఈ సినిమాకి మరుధూరి రాజ డైలాగ్స్ ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని రమేష్ పుప్పల ప్రెస్ కి తెలియజేశాడు. ‘మా బ్యానర్ పై నిర్మిస్తున్న 4వ సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జూలై 9 నుండి ప్రారంబిస్తాం’ అని అన్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ వల్యూస్ తో, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది అని సమాచారం.

Exit mobile version